ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ వైభవ్‌ బ్రాండ్ వాల్యూ

9453చూసినవారు
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ వైభవ్‌ బ్రాండ్ వాల్యూ
భారత క్రికెట్‌లో యువ సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే కాదు, బ్రాండ్ విలువలోనూ దూసుకుపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రూ.1.10 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో ఆడుతున్న అతడు చేసిన ఒక్కో పరుగుకు సుమారు రూ.14 వేల విలువ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్రకటనకు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్