ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధమవుతోంది. కుటుంబ ఆదాయం, ఆస్తులు, వాహనాలు, ప్రభుత్వ ఉద్యోగం, ఆదాయపు పన్ను వంటి ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. జూన్ 19న డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు సమాచారం. ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.