AP: ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ దసరా కానుకగా రూ.15 వేలు ఆర్థికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కోసం సెప్టెంబర్ 17న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ 19వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది 22న పరిశీలిస్తారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఈ పథకానికి అర్హులైన వారికి దసరా పండుగ రోజున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.