ఏపీలో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన 'సూపర్ సిక్స్' హామీల్లో ఒకటైన 'ఆడబిడ్డ నిధి'ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 నుండి 59 ఏళ్ల లోపు అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 (ఏడాదికి రూ.18,000) నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది. ప్రస్తుతం లబ్ధిదారుల అర్హత ప్రమాణాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.