అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

144చూసినవారు
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ‘వాహనమిత్ర’ పథకం కింద వారికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లను క్లియర్ చేసుకున్న అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సహాయం అందుతుందని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. మొత్తం 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేలుఇస్తామన్నారు.

ట్యాగ్స్ :