సాస్కీ కింద ఐదేళ్లలో ఏపీకి రూ.19 వేల కోట్ల విడుదల

33చూసినవారు
సాస్కీ కింద ఐదేళ్లలో ఏపీకి రూ.19 వేల కోట్ల విడుదల
సాస్కీ కింద ఏపీకి గత ఐదేళ్లలో రూ.19,287 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో రూ.501 కోట్లు, 2022-23లో రూ.6,105 కోట్లు, 2023-24లో రూ.4,090 కోట్లు, 2024-25లో రూ.7,901 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. వీటిద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్