మొదటిసారి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నామని, పేద, మధ్యతరగతి వారికి రూ.2.5 లక్షల బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్యసేవకు కానీ, మిగిలిన కార్యక్రమాల ద్వారా కానీ రూ. 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం తమ సిద్ధంగా ఉందని అన్నారు. బుధవారం జరిగిన ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.