తమిళనాడు సీఎం స్టాలిన్ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.2 వేలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు అల్పాహార పథకం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు ఉచిత పంపుసెట్లు, రూ.5 లక్షల వరకు వైద్య బీమా, ఐదేళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామని డీఎంకే పేర్కొంది.