‘స్వర్ణ పంచాయితీ'తో రూ.200 కోట్ల ఆదాయం

0చూసినవారు
‘స్వర్ణ పంచాయితీ'తో రూ.200 కోట్ల ఆదాయం
AP: గ్రామ పంచాయతీల్లో చేపట్టే పన్నుల వసూళ్లలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. 13వేల పంచాయితీల్లోని 88 లక్షల ఆస్తుల్ని గుర్తించి రూ.1052 కోట్ల పన్ను (FY24-25) మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా చెల్లించే విధానంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీని ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. పన్ను వసూళ్లలో అక్రమాలకు ఈ విధానం అడ్డుకట్ట వేసింది.

సంబంధిత పోస్ట్