AP: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. వారి జీవనోపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.207 కోట్లు విడుదల చేసింది. దీనిపై సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద కేంద్రం తన వాటాగా ఈ నిధులను విడుదల చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.