పెన్షన్ల పంపిణీకి రూ.2745 కోట్లు విడుదల

39645చూసినవారు
పెన్షన్ల పంపిణీకి రూ.2745 కోట్లు విడుదల
AP: ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2745కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ‘గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా 63,50,765 మందికి ఈ నిధులు అందిస్తాం. కొత్తగా 10,578 మంది స్పౌజ్ లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.45వేల కోట్లు వెచ్చించాం. పంపిణీ పారదర్శకంగా ఉండేలా ఇంటి వద్దే పెన్షన్ అందించి జియో-కోఆర్డినేట్స్‌ను నమోదు చేస్తున్నాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్