ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. సూపర్ స్కీమ్

18775చూసినవారు
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. సూపర్ స్కీమ్
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఒక మంచి పథకం. ప్రస్తుతం ఈ పథకం 7.4% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. కేవలం రూ.1000 పెట్టుబడితో ప్రారంభించగల ఈ పథకంలో, ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. ఒక ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు ఈ స్కీములో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, 7.4% వడ్డీ రేటుతో ఏడాదికి రూ.37 వేల వడ్డీ అందుతుంది. అంటే నెలకు రూ.3,083 వడ్డీ వస్తుంది.

సంబంధిత పోస్ట్