ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కిలోల బియ్యం

25558చూసినవారు
ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కిలోల బియ్యం
AP: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరులోని రాయలచెరువుకు ఇటీవల గండి పడింది. కళత్తూరు ఎస్సీ కాలనీ, ఎస్ఎల్ పురం, పాతపాలెం ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో వరద బాధితులైన 960 కుటుంబాలకు ప్రభుత్వం రూ.3.24 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించనుంది. వరదల్లో మరణించిన 1,100 పశువులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83.50 లక్షల పరిహారం కూడా అందజేయనుంది.

సంబంధిత పోస్ట్