అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా బీజేపీ మంగళవారం 31 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర నేతలతో ఈ కార్యక్రమం జరిగింది. యూసీసీ అమలు, వరదరహిత రాష్ట్రం ఏర్పాట్లు, బంగ్లాదేశీ ఆక్రమణలు తొలగించడం, మహిళలకు నెలకు రూ.3వేలు ఇవ్వడం, ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాల కల్పన, 40 లక్షల మహిళలకు లఖ్‌పతి దీదీ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందించడం లాంటివి మ్యానిఫెస్టోలో ఉన్నాయి. కాగా, అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.