దుబాయ్ నుండి అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఫ్లైట్ (6E-1478)లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు.
విమానం ముందు భాగంలోని టాయిలెట్ సౌండ్ స్పీకర్‌లో నల్లటి ప్లాస్టిక్ టేపుతో అత్యంత రహస్యంగా దాచిన 24 విదేశీ బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన ఈ 2 కేజీల 799 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విలువ మార్కెట్లో రూ. 4.26 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.