జనసేన కార్యకర్తకు రూ.5 లక్షల సాయం: నాదెండ్ల

8చూసినవారు
జనసేన కార్యకర్తకు రూ.5 లక్షల సాయం: నాదెండ్ల
AP: మంత్రి నాదెండ్ల మనోహర్‌ బుధవారం జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మృతుడు ప్రేమ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంజినీరింగ్‌ చదువుతూ ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మృతుడి సోదరుడు ఆదినారాయణకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్