AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కార్మికులు ఆందోళన చెందవద్దని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావంతో నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాల నష్టానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదారను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు.