అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు సొమ్ము రూ.6.64 కోట్లు జమ

40చూసినవారు
అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు సొమ్ము రూ.6.64 కోట్లు జమ
AP: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ వార్షిక కౌలును ప్రభుత్వం జమ చేసింది. సాంకేతిక సమస్యలు, ప్లాట్ల విక్రయాలు, వారసుల వివరాలు అందకపోవడం వల్ల 495 మంది రైతుల ఖాతాల్లో 9వ, 10వ, 11వ ఏడాది కౌలు నిలిచిపోయింది. ఏపీ సీఆర్‌డీఏ ఈ సమస్యలను పరిష్కరించి, మొత్తం రూ. 6.64 కోట్లకు పైగా సొమ్మును సంబంధిత రైతులు, భూ యజమానుల ఖాతాలలో జమ చేసింది.