TTDకి రూ.9 కోట్ల విరాళం (వీడియో)

9280చూసినవారు
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణ కోసం ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన రూ.9 కోట్లు విరాళం అందించారు. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఈ విరాళం ఇచ్చారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ భారీ విరాళం అందజేసిన దాతను తితిదే తరఫున అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విరాళాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్