AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులపై సిట్ సప్లిమెంటరీ-2 ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు, రమేష్‌కు కోటికిపైగా ముడుపులు ఇచ్చినట్లు సిట్ పేర్కొంది. ఈ ముడుపులు 2021-23 మధ్య పలు విడతల్లో అందినట్లు సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేష్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితుల రిమాండ్‌ను విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది.