AP: విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయని డ్రైవర్ తెలిపారు.