ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం సమకూరింది. ఖమ్మం, ఇల్లెందు, ఏటూరినాగారం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, మంగపేట ప్రాంతాల నుంచి 214 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ బస్సుల్లో 2 లక్షల మంది భక్తులు మేడారానికి రాకపోకలు సాగించారు. ముఖ్యంగా కొత్తగూడెం డిపో నుంచి 90 బస్సుల ద్వారా 45,431 మందిని తరలించగా, రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది.