పాత డీజిల్ లగ్జరీ బస్సులను ఎల‌క్ట్రిక్‌ ఏసీ బస్సులుగా మార్చనున్న ఆర్టీసీ

3చూసినవారు
పాత డీజిల్ లగ్జరీ బస్సులను ఎల‌క్ట్రిక్‌ ఏసీ బస్సులుగా మార్చనున్న ఆర్టీసీ
AP: ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేకంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎల‌క్ట్రిక్‌ ఏసీ బస్సులుగా మార్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఆర్టీసీ సంస్థ. మొట్ట మొదటగా చిత్తూరు జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. పూణే, బెంగళూరు సంస్థల సహకారంతో ఆర్టీసీ బస్సులను మార్చబోతున్నారు.

ట్యాగ్స్ :