AP: మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఏసుబాబుతో మాజీ మంత్రి పేర్ని నాని దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనతో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై శనివారం పేర్ని నాని వివరణ ఇచ్చారు. ‘సీఐ ఏసుబాబు విధులకు నేను ఎక్కడా ఆటంకం కలిగించలేదు. సుబ్బన్న పెళ్లిపీటల మీద కూర్చొవాల్సి ఉండటంతో త్వరగా రిమాండ్ ఇవ్వాలని అడిగాను. బెయిల్‌పై తీసుకొచ్చుకుంటామని చెప్పాం’ అని పేర్ని నాని అన్నారు.