AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం,
వైసీపీ అధినేత
జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏం చేసినా ఫర్వాలేదనే స్థితిలో ఉందని, దీనివల్లే ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకుపోయి.. రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోందని, పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం సన్నగిల్లిందని, పోలీస్ స్టేషన్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ, అవినీతిని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని, వ్యవస్థలు కుప్పకూలిపోయాయని విమర్శించారు.