టాలీవుడ్ హీరో జూనియర్
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్) గురించి వస్తున్న పుకార్లపై చిత్రయూనిట్ స్పందించింది.
ఎన్టీఆర్ మేకోవర్, షెడ్యూల్ రద్దయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే ముందుకు సాగుతోందని యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.