శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా విచారణ కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ సున్నితమైన వివాదంపై తుది విచారణ చేపట్టింది. మత స్వేచ్ఛ పరిధిని పరిశీలిస్తున్న ధర్మాసనం, రుతుక్రమం ఆధారంగా మహిళలను అంటరానివారిగా చూడటం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కేసుతో పాటు పలు మతపరమైన వివక్షతలకు సంబంధించిన పిటిషన్లను కూడా కలిపి విచారిస్తున్నారు.