AP: రాష్ట్రవ్యాప్తంగా సదరం సర్టిఫికెట్ల కోసం 57,452 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి వైకల్య ధ్రువీకరణకు ఈ నెల 30 నుంచి మే నెలాఖరు వరకు 110 ఆస్పత్రుల్లో 80 వేల వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వైకల్య శాతంపై అప్పీల్ చేసుకున్నవారు తొలత పొందిన ఐడీని తొలగించుకుని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.