AP: తిరువూరు టీడీపీలో పంచాయితీ సర్దుమణిగేలా కనిపించడం లేదు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై నిన్న పార్టీ కార్యకర్తల సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని చిన్ని అనుచరులు పార్టీ పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దాంతో టీడీపీలో విభేదాలు మొదలయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.