సాయికృష్ణ కేసు.. తల్లి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

47చూసినవారు
సాయికృష్ణ కేసు.. తల్లి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
AP: గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం విచారణకు ఈ పిటిషన్ రీచ్ కాకపోవడంతో తదుపరి రోజుకు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణ నివేదికను మంగళవారం హైకోర్టుకు సమర్పించనుంది. నివేదిక ఆధారంగా కేసు పురోగతిపై కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్