AP: విజయవాడకు చెందిన సాయికృష్ణ కేసు మిస్టరీపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసును డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ సైడ్ క్యారెక్టర్ పాత్ర పోషిస్తున్నారని, తానా తందాన అంటూ నాటకాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు.