సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు

17731చూసినవారు
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు
AP: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. గత కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తాజాగా పోలీసుల ఎదుట హాజరయ్యారు. సాయికృష్ణ మృతి కేసులో వీరిపై నమోదైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. లొంగిపోయిన నిందితులను పోలీసులు విచారించిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్