ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ రవి నాథ్ తిలహరి, జస్టిస్ సుభేందు సమంతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.