శ్రీవారి లడ్డూపై రాజకీయ దురుద్ధేశంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని వైసీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తులను షాక్‌కి గురిచేసిన పాపం చంద్రబాబుదేనని, ఆయన ప్రజాక్షేత్రంలో బోనులో నిలబడాలని అన్నారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణలను జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం తప్పని తేల్చాయని, ఆధారాలు లేని ఆరోపణలు చేసి తమపై నిందలు వేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు.