ఐపీఎల్ బెట్టింగ్స్ పై సీపీ సజ్జనార్ వార్నంగ్..

1433చూసినవారు
ఐపీఎల్ బెట్టింగ్స్ పై సీపీ సజ్జనార్ వార్నంగ్..
ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభం నేపథ్యంలో, హైదరాబాద్ సీపీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్‌లో జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో నిషేధించినప్పటికీ, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ దందా కొత్త రూపం దాల్చిందని, డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 94906 16555 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్