సోషల్ మీడియాలో 'సమోసా' పేరుతో రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బయట తక్కువ ధరకు లభించే సాధారణ సమోసానే రెస్టారెంట్లలో భారీ ధరలకు విక్రయిస్తున్న తీరును హాస్యభరితంగా చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. సమోసా ధరల వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న ఓ బాలుడు ఆశ్చర్యానికి గురయ్యే సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. వినోదంతో పాటు ఆహార పదార్థాల ధరలపై వ్యంగ్యంగా సందేశాన్ని అందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.