AP: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించే 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని CM చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ చేయాలని, రిస్క్ కేటగిరిలో ఉన్నవారిని అప్రమత్తం చేసి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలని, ఆస్పత్రుల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి రాయితీలు ఇస్తామని తెలిపారు.