టీ20 ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్‌కు యూకే పర్యటన నిరాశను మిగిల్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ.. సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే, సంజూ తుది జట్టులోకి వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ ఎవరిపై వేటు వేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం కోసం సంజూపై వేటు వేశారు. ప్రస్తుత భారత తుది జట్టులో ఏడుగురు బ్యాటర్లలో ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లే ఉండటం సమస్యగా మారింది. ఈ తరుణంలో కుడిచేతి వాటం కలిగిన సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.