ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన గణపతి దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రోక్త విశ్వాసం. ఫిబ్రవరి 5న సంకష్టహర చతుర్ధశి వస్తోంది. గణేశుడిని పూజించడం వల్ల అడ్డంకుల తొలగింపు, ఆరోగ్యం, శక్తి, విజయం, సంపద, మానసిక శాంతి లభిస్తాయి. పూర్వజన్మ కర్మలు, పాపాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండి, చంద్రోదయం తర్వాత చంద్రుడిని, గణపతిని దర్శించుకుని పూజ చేయడం ద్వారా వ్రతం పూర్తవుతుంది. గణపతి పూజతో జీవితం సకల శుభాలతో నిండిపోతుంది.