AP: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడి పందేల సందడి నెలకొంది. పండుగ కోసం ఐదు రోజుల పాటు లాడ్జీలు, హోటల్ గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని హోటళ్లలో మూడు రోజుల బసకు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తుండటం చర్చనీయాంశమైంది. గదులు దొరకని నేపథ్యంలో కల్యాణ మండపాలను కూడా బుక్ చేసుకుంటున్నారు.