పార్లమెంట్ సమావేశాలను దేశవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సంసద్ టీవీ ప్రసారాలను తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఉభయ సభల్లో సభ్యులు చేసే ప్రసంగాలను ఆయా ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో అనువదించి ప్రసారం చేయనున్నారు. దీంతో ప్రజలు తమ మాతృభాషలోనే పార్లమెంట్ చర్చలను వీక్షించే అవకాశం లభించనుంది. సంసద్ టీవీ ప్రసారాలను యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చని లోక్‌సభ సచివాలయం తెలిపింది.