ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని తన ఖరీదైన బంగ్లాను బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ 'ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అనే విద్యా సంస్థకు లీజుకు ఇచ్చారు. మే 1 నుంచి అమలులోకి రానున్న ఈ ఒప్పందం ప్రకారం, నెలకు రూ. 6.5 లక్షల అద్దెతో ఐదేళ్ల కాలానికి సుమారు రూ. 4.14 కోట్ల ఆదాయం సారాకు రానుంది. అద్దెదారు రూ. 20 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఈ లీజులో మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ తో పాటు, ప్రతి ఏటా 5 శాతం అద్దె పెరుగుదల కూడా ఉంది.