చిరంజీవి కూతురి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సారా అర్జున్?

11196చూసినవారు
చిరంజీవి కూతురి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సారా అర్జున్?
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో 'ధురంధర్' సినిమాతో సంచలనం సృష్టించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ చిరంజీవికి కూతురిగా నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రియమణి, ఏఆర్ రెహమాన్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖులు కూడా భాగమయ్యారు.

సంబంధిత పోస్ట్