TG: మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆదివాసీ పూజారులు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో అలంకరించారు. కాసేపట్లో కన్నెపల్లి నుంచి మేడారంకు సారలమ్మ బయలుదేరనున్నారు. సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ళు, ఆదివాసీ నృత్యాలతో సారలమ్మను మేడారం తీసుకురానున్నట్లు కాక సారయ్య తెలిపారు.