అక్టోబర్​ 8 నుంచి డ్వాక్రా సంఘాల మహిళలకు 'సరస్' మేళా

10953చూసినవారు
అక్టోబర్​ 8 నుంచి  డ్వాక్రా సంఘాల మహిళలకు 'సరస్' మేళా
AP: రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే లక్ష్యంతో విజయవాడలో జాతీయ సరస్ మేళా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్​లో మేళా ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ లక్ష్మీశా, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేళాను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి పెమ్మసాని సూచించారు.

సంబంధిత పోస్ట్