ఓటీటీలో విజయవంతమైన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ నాలుగో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన సీజన్ 3
జియో హాట్‌స్టార్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. షో రన్నర్ మహి వి.రాఘవ్ సీజన్ 4ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ భాగంలో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్టార్ హీరో పాత్ర సిరీస్‌ను ఏ మలుపు తిప్పుతుందనే ఆసక్తి నెటిజన్లలో నెలకొంది. మేకర్స్ ప్రస్తుతం ఆ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.