ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు జులై 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వేరియంట్‌లపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, రివార్డ్ పాయింట్లను సంపాదించే పరిమితుల్లో మార్పులు చేయడంతో పాటు, కొన్ని రకాల లావాదేవీలను రివార్డ్ కేటగిరీ నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ మార్పులు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల రివార్డ్ పాయింట్ల సంపాదనపై ప్రభావం చూపనున్నాయి.