ముంబైలోని చెంబూర్ రోడ్ నంబర్ 11లో మంగళవారం మధ్యాహ్నం స్కూల్ బస్సుపై చెట్టు కూలిపడిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన 11 ఏళ్ల విహాన్ అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విహాన్ ఒక్కడే సంతానం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో, విహాన్ ఇష్టపడే
క్రికెట్ బాల్, బ్యాట్‌ను కూడా ఖననం చేశారు.