AP: ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బైక్ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న స్కూల్ బస్సు ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి కారణమైంది.