పాఠశాల బస్సు బోల్తా.. త్రుటిలో తప్పిన ప్రమాదం

19చూసినవారు
పాఠశాల బస్సు బోల్తా.. త్రుటిలో తప్పిన ప్రమాదం
AP : బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కు చెందిన బస్సు మీసాలవారిపాలెం వైపు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పాఠశాలలు ప్రారంభమైన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామస్థుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేరు, డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.